నాలుగేళ్ల బిడ్డకు ఉరేసి .. తాను గొంతు కోసుకుని , బెజవాడలో వివాహిత ఘాతుకం
విజయవాడ నగర శివార్లలోని ప్రసాదంపాడులో దారుణం జరిగింది. బిడ్డకు ఉరేసి చంపి ఓ తల్లి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

విజయవాడ నగర శివార్లలోని ప్రసాదంపాడులో దారుణం జరిగింది. నాలుగేళ్ల బిడ్డను కేబుల్ వైరుతో హతమార్చిన తల్లి అనంతరం కత్తితో గొంతు కోసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుమార్తె అనారోగ్యం కారణంగా ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.