కన్న కొడుకు కాళ్లు చేతులు కట్టేసి హతమార్చిన తల్లి..

గుంటూరులో ఓ తల్లి కిరాతకానికి ఒడిగట్టింది. కన్న కొడుకునే కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి.. ఊపిరి ఆడకుండా తలకు పాలిథిన్ కవర్ చుట్టి.. ఆ తరువాత దిండుతో మొహంపై అదిమి హతమార్చింది. ఆ కన్నతల్లి ఇంత దారుణానికి ఒడి గట్టడం వెనుక ఎంతో ఆవేదన ఉంది. గుంటూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

mother assassination own son in guntur district - bsb

గుంటూరులో ఓ తల్లి కిరాతకానికి ఒడిగట్టింది. కన్న కొడుకునే కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి.. ఊపిరి ఆడకుండా తలకు పాలిథిన్ కవర్ చుట్టి.. ఆ తరువాత దిండుతో మొహంపై అదిమి హతమార్చింది. ఆ కన్నతల్లి ఇంత దారుణానికి ఒడి గట్టడం వెనుక ఎంతో ఆవేదన ఉంది. గుంటూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

వివరాల్లోకి వెడితే ఓ కొడుకు మద్యం, గంజాయికి అలవాటు పడి.. తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసేవాడు. ఇంటి పరువు బజార్న పెట్టేవాడు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆ తల్లి చివరికి ఇలా కడతేర్చింది. 

నగరంపాలెం పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఎ.మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని ఏటీ అగ్రహారం 8వ లైనులో నివాసముండే వల్లపు పోతురాజు, సుమలత దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె పుష్పాంబికకు పెళ్లి చేసి పంపించారు. కాగా కొడుకు సిద్ధార్థ (17) సిమెంట్ పనులు చేస్తుంటాడు. 

తల్లి సుమలత మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికురాలు. సిద్ధార్థకు చిన్నప్పటి నుంచే చెడు స్నేహాలతో దురలవాట్లకు లోనయ్యాడు. ఇలా ఉండగా పదేళ్ల క్రితం తండ్రి పోతురాజు మరణించాడు. ఇక ఇంట్లో అదిలించేవాళ్లు లేక సిద్ధార్థ నిత్యం మద్యం, గంజాయి, సొల్యూషన్‌ తాగి వచ్చి ఆ మత్తులో ఇంకా డబ్బులు కావాలంటూ తల్లి సుమలతను వేధింపులకు గురి చేస్తుండేవాడు. 

డబ్బులు ఇవ్వకుంటూ.. ఇంటిమీద రాళ్లు వేయడం, తల్లిని చిత్ర హింసలకు గురి చేయడంతో పాటు.. తల్లిని కొడుతుండేవాడని పోలీసులు తెలిపారు. దీనికి తోడు లాలాపేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఏటుకూరు రోడ్డులో ఒక చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులోనూ సిద్ధార్థ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో సుమారు 14 నెలల పాటు విజయవాడ జైలులో ఉండి వచ్చాడు. 

ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లోనుంచి వెళ్లి తెల్లవారుజామున 4గంటలకు ఇంటికి వచ్చాడు. అప్పటికే చాలా దొంగతనాలు చేసిన సిద్ధార్థను ఎక్కడికి పోయి వచ్చావని తల్లి ప్రశ్నించింది. దీంతో ఆమెను నానా రకాలుగా దుర్బాషలాడాడు. 

అప్పటికే సిద్ధార్థ వ్యవహరిస్తున్న తీరుతో బంధువులు, చుట్టుపక్కలవారు సుమలతను అవమానించడం మొదలుపెట్టారు. ఎన్నిసార్లు కొడుకును హెచ్చరించినా అతను మారలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి సంఘటనతో ఆమె విసిగిపోయింది. శనివారం మధ్యాహ్నం ఫూటుగా మద్యం తాగి వచ్చి నిద్రిస్తున్న కొడుకును కాళ్లు, చేతులు కట్టేసింది.. అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసింది. ఊపిరి ఆడకుండా తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టింది. ఆ తరువాత దిండుతో అదిమి చంపేసింది. 

ఆ తరువాత సుమలత నేరుగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయి తానే హత్య చేసినట్టు పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు నివ్వెరపోయారు. స్టేషన్ ఎస్ హెచ్ వో మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని సిద్ధార్ధ మృతదేహాన్ని పరిశీలించారు.  పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios