ఒంగోలు:ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో  తల్లీ కూతుళ్లు  అనుమానాస్పదస్థితిలో మరణించారు. వీరిద్దరి మృతికి భర్త చంద్ర కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెంలో  అమరేశ్వరీ, ఆమె కూతురు దివ్య ఉరేసుకొని చనిపోయారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకొన్నారా... లేక వారిని  భర్త చంద్ర హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

దివ్య ఇంటర్ చదువుతోంది. చంద్ర రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా చంద్ర మద్యానికి బానిసగా మారాడు. దీంతో భార్య, భర్తల మధ్య నిత్యం గొడవలు చోటు చేసుకొంటున్నాయి.

అయితే  సోమవారం రాత్రి అమరేశ్వరీ, దివ్య ఉరేసుకొని చనిపోయి కన్పించారు. చంద్ర మాత్రం త్రిపురాంతకం లో మద్యం తాగి  స్పృహ కోల్పోయి రోడ్డుపై పడి ఉన్నాడు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే  పోలీసులు  అతడిని చంద్రగా గుర్తించారు.

అమరేశ్వరీ, దివ్య మృతికి కారణమేవరనే కోణంలో  పోలీసులు ఆరా తీస్తున్నారు.  చంద్రను ఎర్రగొండపాలెం తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు.