కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ కుటుంబం మీద కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు తీవ్రగాయాలపాలై మృతి చెందారు.
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబంపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన కర్నూలు సుబ్బలక్ష్మీ నగర్ లో జరిగింది. ఈ దాడిలో తల్లీ కుమార్తెలు తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఇంటి యజమానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ జంట హత్యలకు కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
