కృష్ణా జిల్లా విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మునిసిపల్ ఆఫీస్ దగ్గర బందరు కాలువలో ఇద్దరు పిల్లలతో కలిసి దూకి ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మునిసిపల్ ఆఫీస్ దగ్గర బందరు కాలువలో ఇద్దరు పిల్లలతో కలిసి దూకి ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే చిన్నారులిద్దరు ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో బయటపడగా పాపం తల్లి మాత్రం మృత్యువాతపడ్డారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆత్మహత్యకు పాల్పడిన మహిళ పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన నాగస్వరూప రాణి(30)గా గుర్తించారు. మృతురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవటానికి బందరు కాలువలో దూకింది. అయితే ఊపిరాడక తామిద్దరం ఒడ్డుకు వచ్చామని... తన తల్లి మాత్రం రాలేదని చెబుతూ పిల్లలు రోదిస్తున్నారు. 

read more కృష్ణా జిల్లాలో అధికారుల వేధింపులతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య: సెల్పీ వీడియో పోస్టు

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.