సీఎం జగన్ పాదయాత్ర చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ నాయకులు వేడుకలు నిర్వహించారు. సీఎం జగన్ 3,648 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయి నేటికి సరిగ్గా రెండేళ్ళు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు  సర్వమత ప్రార్ధనలు చేశారు. 

రాజ్యసభ సభ్యుడు, మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ  సీఎం జగన్ సుదీర్ఘమైన పాదయాత్ర ముగించి రెండు సంవత్సరాలు పూర్తయ్యిందన్నారు. తండ్రిని మించిన తనయుడుగా సీఎం జగన్ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకున్నారని పొగిడారు. 

ఈ పాదయాత్ర 14 నెలలు జరిగిందని తెలిపారు. అమ్మవడి, రైతు భరోసా లాంటి కార్యక్రమాలకు పాదయాత్ర లో తెలుసుకున్న విషయాలే కారణమని అన్నారు. పేదలకు సహాయం చేయడానికి ఖజానాల గురించి ఆలోచించక్కర్లేదని,  పదిహేను లక్షల ఇళ్ళు రాష్ట్రమే ఇవ్వడం సంతోషకరం అన్నారు. 

"

ప్రతిపక్ష నాయకుడు పేదల సంతోషాన్ని చూసి ఓర్వలేడని, దేవాలయాలలో విగ్రహాలు ధ్వంసం వంటివి సృష్టిస్తున్నారన్నారు. 

స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఏకపక్ష నిర్ణయం అని మండిపడ్డారు. స్ధానిక ఎన్నికల నిర్వహణ అనేది ప్రస్తుత పరిస్ధితులలో కుదరదని, ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా.. నిమ్మగడ్డ రమేష్ నియంతృత్వ ధోరణిలో షెడ్యూల్ విడుదల చేసారన్నారు. 

స్ధానిక ఎన్నికల కోడ్ తో సంక్షేమ పధకాలు ఆపలేరని, అమ్మ వడి అనేది విద్యార్ధుల కోసం నిర్ణయించిన పథకమని ఈ అమ్మ వడి ఆపడానికే ఎన్నికల కోడ్ తీసుకొచ్చారన్నారు. స్ధానిక షెడ్యూల్ పై న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.