మాంటిస్సోరి విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు.

1925లో జన్మించిన ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సమయంలో కోటేశ్వరమ్మ 1955లో మాంటిస్సోరి పాఠశాలను స్థాపించారు. కేవలం విద్యార్ధినుల కోసమే ఇంటర్, డిగ్రీ పాఠశాలలు ఏర్పాటు చేశారు.

తన విద్యాసంస్థల ద్వారా లక్షలాది మందికి విద్యాదానం, స్త్రీ విద్య, సమాజ నిర్మాణం, మహిళా సాధికారత కోసం విశేషంగా కృషి చేశారు. మాంటిస్సోరి విద్యాసంస్థలలో మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంపీ మాగంటి బాబు, ఐఏఎస్ అధికారి ఉషాకుమారి, డాక్టర్ రమేశ్ తదితర ప్రముఖులు విద్యను అభ్యసించారు.

కోటేశ్వరమ్మ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.