గన్నవరం: గుంటూరులో  జరిగే బీజేపీ సభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఉదయం విజయవాడకు చేరుకొన్నారు. మోడీకి ఏపీ బీజేపీ నేతలు  ఘనంగా స్వాగతం పలికారు. 

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక విమానంలో మోడీ విజయవాడకు చేరుకొన్నారు. గుంటూరులో జరిగే ఎన్నికల సభలో మోడీ పాల్గొంటారు.

మోడీ పర్యటనను పురస్కరించకొని రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్  మోడీకి స్వాగతం పలికారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున  కూడ ఏ ఒక్కరూ కూడ హాజరుకాలేదు. 

మోడీని మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు స్వాగతం పలికారు.గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అనుమతి లభించలేదు.