తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్ వెలువరించింది
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్ వెలువరించింది.
ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని , కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇందుకు సంబంధించి ఆగస్టు 7న నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు విధించారు. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలిన, ఆగస్టు 19న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఆగస్టు 26న పోలింగ్ జరిపి.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 1, 2019, 5:54 PM IST