Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే కారులో జైలుకు వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు..

మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చి తిరిగి జైలుకు వెళ్లిన ఎమ్మెల్సీ ఆనంతబాబు.. ఓ ఎమ్మెల్యే కారులో అక్కడికి రావడం చర్చనీయాంశంగా మారింది. 

MLC Anantha Babu came to jail in MLA's car In andhrapradesh
Author
First Published Sep 10, 2022, 10:33 AM IST

రాజమహేంద్రవరం : తల్లి అంత్యక్రియల నిమిత్తం 14 రోజుల మధ్యంతర బెయిల్ పై వెళ్ళిన ఎమ్మెల్సీ అనంత బాబు ఆ గడువు పూర్తి కావడంతో శుక్రవారం తిరిగి జైలుకు వచ్చినట్లు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపర్డెంట్ ఎస్ రాజారావు తెలిపారు. కోర్టు ఈ నెల 23వరకు అతని రిమాండ్ పొడిగించింది. రాజమహేంద్రవరం శివారు ప్రాంతమైన క్వారీ మార్కెట్ కూడలి వరకు ఓ ఎమ్మెల్యే కారులో వచ్చిన ఆనందబాబు అక్కడి నుంచి మరో వాహనం మారి జైలుకు చేరుకున్నారు. సంబంధిత ఎమ్మెల్యే  ఎస్కార్ట్ కూడా ఆయన వెంట రావడం గమనార్హం. అప్పటికే జైలు ఆవరణలో అతని అనుచరులు, వైసీపీ మద్దతుదారులు చేరుకున్నారు. అనంత బాబు రాగానే ఆయనతోపాటు రెండో గేటు వరకు వెళ్లారు.

కాగా, తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్యే అనంత బాబు అలియాస్ అనంత ఉదయభాస్కర్ కోర్టు రిమాండ్ జూన్ 20న పొడిగించింది. గతంలో కోర్టు విధించిన రిమాండ్ జూన్ 20తో ముగిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను జూమ్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలోనే జూలై ఒకటో తేదీ వరకు అనంత బాబుకు రిమాండ్ విధిస్తూ రాజమండ్రి కోర్టు  నిర్ణయం తీసుకుంది .ఈ కేసులో మే23 నుంచి అనంత బాబు రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 

ప్రాణాలను ఫణంగా పెట్టి చంపావతి నదిని దాటి ప‌రీక్ష రాసిన యువ‌తి.. ఆమెను భుజాల‌పై మోసిన సోద‌రులు

ఇప్పటికే అనంత బాబు బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్ ను అధికారులు కొట్టివేశారు. దీనికి 2 రోజుల క్రితం కూడా ఎమ్మెల్సీ అనంత బాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు ఇప్పటికే కొట్టివేసిన సంగతి తెలిసిందే. అనంత బాబు బెయిల్ పిటిషన్ ను రాజమండ్రి ఎస్పీ, ఎస్సీ కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ మంజూరు చేయడానికి నిందితుల తరఫు న్యాయవాది సరైన కారణాలు చెప్పడం అందువల్ల బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

ఇదిలా ఉండగా, మే 23న డ్రైవర్  సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును పోలీసులు అరెస్టు చేసిస్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చూపారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తో పాటు మృతుడు సుబ్రమణ్యం స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు మరో ముగ్గురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. 

కాకినాడ కోర్టుకు సెలవులు కావడంతో స్పెషల్ మొబైల్ జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ ఇంట్లో ఎమ్మెల్సీ అనంతబాబును హాజరుపరిచారు. కోర్టు సమయం ముగియడంతో జడ్జి ఇంటికి తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుండి అనంతబాబును వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించాలని భావించారు. అయితే మార్గమధ్యలో పోలీసులు ఎమ్మెల్సీని తరలిస్తున్న వాహనాలను సర్పవరం వైపునకు మళ్లించారు. సర్పవరం గెస్ట్ హౌస్ నుండి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి ఎమ్మెల్సీని తరలించారు.  కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన తర్వాత జడ్జి ఇంటికి అనంతబాబును తరలించారు. ఈ మేరకు జడ్జికి సమాచారం పంపారు. మరో వైపు జడ్జి ఇంటి వద్ద దిశ డీఎస్సీ మురళీమోహన్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios