ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ అధనేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కాగా... జగన్ సీఎం అయ్యినందుకు గాను ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రత్యే పూజలు నిర్వహించారు.

మణికొండలోని శ్రీపార్వతీసమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామికి ఎమ్మెల్యే రోజా మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు రోజాతో ప్రత్యేక పూజలు చేయించారు. 

మణికొండ పంచవటి కాలనీలో నివాసం ఉంటున్న రోజా ఎన్నికలకు ముందు ఇక్కడ దర్శించుకుని వెళ్లిందని, ఆమె గెలిచినందున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ప్రతినిధి నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆలయంలో ఇతర భక్తులను పలకరిస్తూ రోజా అందరితో అప్యాయంగా మాట్లాడారు.