రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా లేదన్నా నిర్వహించాల్సిందేనని పట్టుపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన చేస్తున్న కామెంట్స్ కి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందించారు. నిమ్మగడ్డ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల కమీషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్నారు. అలాంటి సంస్థకు అధిపతిగా ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా ప్రారంభంలో రాష్ట్రంలో ఏడు యాక్టివ్ కేసులు ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డకు... ఇప్పుడు రోజుకి 7 వందల కేసులు వస్తున్నాయి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 16 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి... 6వేల మందికి పైగా చనిపోయారు...సెకండ్ వేవ్ వస్తుందని ఇతర దేశాలు సైతం అప్రమత్తం అవుతుంటే రమేష్ కుమార్‌కు పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరిందని మండిపడ్డారు

చంద్రబాబుకు, టీడీపీకి తొత్తులాగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుల పిచ్చి పట్టిన అహంకార వాదిలా నిమ్మగడ్డ ప్రయత్నాలు ఉన్నాయని, ఎన్నికల కమిషనర్‌ అన్న విషయాన్ని నిమ్మగడ్డ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆ స్థానం వదిలేసి.. నిమ్మగడ్డ రమేష్‌లా వ్యవహరించవద్దని ఎమ్మెల్యే సూచించారు

ఓటు విలువ తెలుయని... గుర్తు ఏంటో తెలియని పార్టీలను పిలిచామని చెప్పారు.. పిలిచి ఏమి చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, వ్యవస్థను మొదట సంప్రదించాలని, వ్యవస్థను గౌరవించాల్సిందిగా నిమ్మగడ్డను కోరుతున్నామన్నారు. మీరు ఆడమన్నట్లు ఆడటానికి ప్రభుత్వం మీ జేబు సంస్థ అనుకుంటున్నారా అన​ఆన్నారు. మార్చిలోపు మీరు దిగిపోతారని.. ఎన్నికలు పెట్టాలన్నా నిబం‍ధన ఏమైనా ఉందా అంటూ ఆయన మండిపడ్డారు.