బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన జలీల్ ఖాన్

First Published 14, Sep 2018, 4:11 PM IST
MLA Jaleel Khan Sensational Comments on bjp, ycp
Highlights

సీఎం చంద్రబాబు నాయుడికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పోరాడిన చంద్రబాబు నాయుడుకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చెయ్యడం సరికాదని మండిపడ్డారు. 

విజయవాడ: సీఎం చంద్రబాబు నాయుడికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పోరాడిన చంద్రబాబు నాయుడుకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చెయ్యడం సరికాదని మండిపడ్డారు. 

బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన విజయ మాల్యాకు సహకరించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి నాన్‌ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని సూచించారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపైనా తనదైన శైలిలో విరుచుపడ్డారు. కన్నాలక్ష్మీనారాయణ పేరులోనే పెద్ద కన్నం ఉందని ఘాటుగా విమర్శించారు. కన్నా మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచేశారని జలీల్ ఖాన్ ఆరోపించారు. 
 
మహా కూటమి అంటే ప్రధాని మోదీకి భయమేస్తోందని అందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని జలీల్ ఖాన్ విమర్శించారు. త్వరలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. అయితే గతంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు  జలీల్ ఖాన్ చెప్పడం అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. 

loader