హిందూపురం జిల్లా (hindupur district) కోసం సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (balakrishna) ఉద్యమించనున్నారు. దీనిలో భాగంగా ఆయన మౌన దీక్ష చేపట్టనున్నారు. ముందుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత బాలకృష్ణ దీక్ష చేపట్టనున్నారు.  

హిందూపురం జిల్లా (hindupur district) కోసం సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (balakrishna) ఉద్యమించనున్నారు. దీనిలో భాగంగా ఆయన మౌన దీక్ష చేపట్టనున్నారు. ముందుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత బాలకృష్ణ దీక్ష చేపట్టనున్నారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల (new districts in ap) ఏర్పాటు సర్వం సిద్ధం చేసి సీఎం జ‌గ‌న్ స‌ర్కార్ (ys jagan govt) మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు పై వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల ఏర్పాటుపై పలు డిమాండ్లు తెరమీదకు వ‌స్తున్నాయి. అయితే.. జిల్లాల పునర్విభజనను కొందరూ స్వాగ‌తిస్తుంటే.. మ‌రికొంద‌రూ ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప‌లు చోట్ల జిల్లాల పేర్ల విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ క్ర‌మంలో అనంతపురం జిల్లాలో (anantapur) నిరసనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను (satya sai district) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ల్లో ఏ ఒక్క‌రూ కూడా స్పందించ‌డం లేదు. వారికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేదు. 

దీంతో ఆ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నిర‌స‌నకారులు స్థానిక వన్‌టౌన్ పోలీసు సేష్ట‌న్ లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ లు క‌న‌బ‌డ‌టం లేద‌ని ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా వారంతా బయటికి వచ్చి, వెంటనే పదవులకు రాజీనామా చేసి, హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.