హైదరాబాద్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై వరుసకు సోదరుడైన మోహన్ రావు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తినుబండారాలు ఇప్పిస్తానని చెప్పి ఆ బాలికపై  అఘాయిత్యానికి పాల్పడినట్టుగా బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మచిలీపట్నంలో నివాసం ఉంటున్న బాధితురాలికి దగ్గరి బంధువుగా ఉన్న మోహన్ రావు ఈ దారఉనానికి ఒడిగట్టాడు.  తిను బండారాలు ఇప్పిస్తానని చెప్పి బాలికను బయటకు తీసుకెళ్లి  అత్యాచారానికి ఒడిగట్టేవాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు వరుసకు సోదరుడు అవుతాడు.  అత్యాచారం చేసిన విషయాన్ని  బయటకు చెబితే  చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టుగా బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.