ఒంగోలులో అమానుషం జరిగింది. మైనర్ కు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగికదాడికి పాల్పడి.. ఆ తర్వాత ఆరు నెలల గర్భాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీయించారు. బాధితురాలి తండ్రి మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. కొమరోలు మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక అక్కడి కేజీబీవీ లో చదువుతోంది.

కరోనా నేపథ్యంలో బడికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటుంది. ఆమెను అదే గ్రామానికి చెందిన కాశీ రావు అని వ్యక్తి మరో మహిళ ద్వారా ఇంటికి రప్పించుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక ఆరు నెలల గర్భం దాల్చింది.
నిందితుడు విశ్వరూపం అనే వ్యక్తిని ఆశ్రయించి.. అతడి ద్వారా సుభానీ అనే ఆర్ఎంపీ వద్ద గర్భం తీసేయించారు. కుమార్తె అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు పలు ఆసుపత్రిలో చూపించారు. ఓ ఆస్పత్రిలో బాలికకు గర్భం తీసేసిన విషయం గుర్తించారు.
దీంతో షాక్ తిన్న బంధువులు గట్టిగా నిలదీయడంతో ఆమె ఈ విషయం చెప్పింది. చంపేస్తామని బెదిరిస్తున్నారని తనకు రక్షణ కల్పించి తీసుకోవాలని కోరుతూ బాధితులు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
దీని మీద అదనపు ఎస్పీ రవిచంద్ర స్పందిస్తూ ఫిర్యాదుపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ మార్కాపురం డిఎస్పీ ఆదేశించారు.