ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకన్నాయి. శనివారం జిల్లాలోని మాదిరెడ్డిపాలెం, చల్లగిరిలో భూమి కంపించింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకన్నాయి. శనివారం జిల్లాలోని మాదిరెడ్డిపాలెం, చల్లగిరిలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి పరగులు తీశారు. దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.