Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంబవించింది. భూకంపంతో ప్రజలు బయంతో బయటకు పరుగులు తీశారు. 

Minor Earth quake Reported in Andhra Pradeshs Nellore District
Author
Nellore, First Published Jul 13, 2022, 12:06 PM IST


నెల్లూరు: Nellore జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం నాడు స్వల్ప భూకంపం సంబవించింది. దీంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

జిల్లాలోని ఉదయగిరి, విరకుంటపాడు, దుత్తలూరు, వింజమూరు మండలాల్లో స్వల్ప భూకంపాలు వచ్చినట్టుగా  స్థానికులు చెప్పారు. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని  స్థానిక అధికారులు చెబుతున్నారు. 

చిత్తూరు జిల్లా పలమనేరు లో 2021 డిసెంబర్ 23న భూకంపం వచ్చింది. 2021 నవంబర్ 29న కుప్పం సమీపంలో 25 కి.మీ లోతులో 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. 2021 ఏప్రిల్ 11న కుప్పంలో భూకంపం వచ్చింది. 2021 ఆగష్టు 24న నెల్లూరు తీరానికి 300 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో 10 కి.మీ లోతులో భూకంపం వాటిల్లింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios