వైసీపీ ఎంపీలు రాజీనామా బీజేపీ, వైసీపీల మధ్య కుమ్ముక్కు రాజకీయాలకు నిదర్శనమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాజీనామాలు చేసిన ఐదు లోక్‌సభ స్థానాల్లో ఉపఎన్నికలు ఎందుకు రాలేదో ఆ పార్టీ అధినేత జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, వైసీపీ లాలూచీలో భాగంగానే ఉప ఎన్నికలు జరగడం లేదని యనమల ఆరోపించారు. 

అమరావతి: వైసీపీ ఎంపీలు రాజీనామా బీజేపీ, వైసీపీల మధ్య కుమ్ముక్కు రాజకీయాలకు నిదర్శనమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాజీనామాలు చేసిన ఐదు లోక్‌సభ స్థానాల్లో ఉపఎన్నికలు ఎందుకు రాలేదో ఆ పార్టీ అధినేత జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, వైసీపీ లాలూచీలో భాగంగానే ఉప ఎన్నికలు జరగడం లేదని యనమల ఆరోపించారు. 

వైసీపీ ఎంపీల కన్నా 40 రోజుల తర్వాత రాజీనామా చేసిన మూడు స్థానాలకు కర్ణాటకలో ఉప ఎన్నికలు వచ్చాయని, ఏపీలో రాలేదంటే కుమ్మక్కైనట్లు స్పష్టమవుతోందని తెలిపారు. రాజీనామాల ఆమోదంలో తాత్సారానికి బాధ్యత ఎవరిదో జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభ స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చి 52 రోజులు తాత్సారం అయ్యేలా చేసిందెవరని యనమల నిలదీశారు.

ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, జగన్‌ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఉప ఎన్నికలు రావనే కుట్రను టీడీపీ అప్పుడే బయటపెట్టిందని గుర్తు చేశారు. ఈసీ ప్రకటనతో అది రుజువైందన్నారు.

ఓటమి భయంతోనే ఉప ఎన్నికలు రాకుండా చేశారని, ఏడాది గడువుకు ఒక రోజు తగ్గేలా చూసి ఆమోదించుకున్నారని యనమల ఆరోపించారు. ఉప ఎన్నికలు జరిగితే టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్న భయంతోనే ఇదంతా జరగిందని మండిపడ్డారు. 

కేంద్రంలోని బీజేపీ నేతలు రాజకీయ కుట్రలతోపాటు ఆర్థికపరమైన కుట్రలు కూడా చేస్తున్నారని విమర్శించారు. అన్ని హక్కులు, చట్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లను వెనక్కి తీసుకోవడమే నిదర్శనమని ధ్వజమెత్తారు.