జగన్ చేసిన నేరాలను కాపీ కొట్టడం ఎవరివల్లా కాదని మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో రూపొందించిన నవరత్నాలను టీడీపీ కాపీ కొడుతోందంటూ.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. వైసీపీ నేతల ఆరోపణలపై మంత్రి యనమల స్పందించారు.

నవరత్నాలను కాపీ కొడుతున్నారంటూ.. వైసీపీ నేతలు ఆరోపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణాలే జగన్ నవరత్నాలని ఆయన ఎద్దేవా చేశారు.  జగన్ చేసిన నేరాలను కాపీ కొట్టడం ఎవ్వరి వల్లా కాదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ కుంభకోణాలకు అంతేలేదన్నారు. రూ.లక్ష కోట్లు, 13 ఛార్జిషీట్లు, 16 నెలల జైలు.. ఇవే జగన్ రికార్డులని, ఇవి తప్ప జగన్ సాధించింది ఏముందని మంత్రి యనమల ప్రశ్నించారు. సమాజానికి చెడు జరగాలని కోరుకునే పార్టీ వైసీపీ అని, అన్నివర్గాల ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని యనమల రామకృష్ణుడు అన్నారు.