ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. బుధవారం మీడియాపై చిందులు తొక్కారు. 


ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. బుధవారం మీడియాపై చిందులు తొక్కారు. ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి సోమిరెడ్డి ఈ రోజు మీడియా ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సమావేశంలో కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సోమిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అన్నదాత సుఖీభవ పథకానికి వచ్చే ఏడాది బడ్జెట్‌లో కేటాయింపు జరపడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీకు సమాధానం చెప్పాల్సిన నాకు అవసరం లేదు. నాకు ఇష్టమైతేనే సమాధానం చెబుతా’ అంటూ మండిపడ్డారు.

రైతులకు కేంద్రం ప్రకటించిన రూ.6వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4వేలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. రైతులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి, డబ్బులు మాత్రం ఏప్రిల్ తరువాతే ఇవ్వనుంది. ఈ విషయం గురించి విలేకరులు ప్రశ్నించగా సోమిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వచ్చే నెల బడ్జెట్‌కి ఇప్పుడు చెక్కులిస్తారా అన్న ప్రశ్నకు నీళ్లు నమిలారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయారు.