Asianet News TeluguAsianet News Telugu

"జైలుకు పంపక.. జైలర్ సినిమాకి పంపిస్తారా?" లోకేష్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మంత్రి రోజా..  

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. టిడిపి నేతలు, కార్యకర్తల ఆందోళన మధ్య చంద్రబాబును విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించారు. ఈ నారా లోకేష్ జగన్ ను టార్గెట్ చేస్తూ..ట్వీట్ చేయగా.. అందుకు వైసిపి మంత్రి రోజా.. ట్విట్టర్ వేదికగా లోకేష్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 

Minister Roja Strong Counter To Lokesh Tweet KRJ
Author
First Published Sep 9, 2023, 10:41 PM IST

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఊహించని షాక్ తగిలింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.ఈ నేపథ్యంలో టిడిపి నేతలు, కార్యకర్తల ఆందోళన మధ్య చంద్రబాబును విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించారు.

అనంతరం చంద్రబాబుపై సిఐడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 15 నుండి 20 ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. టిడిపి అధినేత అరెస్టు నిరసిస్తూ ఆ పార్టీ నేతలు కార్యకర్తలు రోడ్డు పైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. 

ఈ క్రమంలో తండ్రి చంద్రబాబు అరెస్ట్ చేయడం పట్ల నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. "పిచ్చోడు లండన్ కి.. మంచోడు జైలుకి.. ఇది కదా రాజిరెడ్డి రాజ్యాంగం. ఎఫ్ఐఆర్ లో పేరు లేదు. అరెస్టు ఎందుకు చేశారో తెలియదు. మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్ళల్లో ఆనందం. నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబుపై అవినీతి మచ్చ వేయడం సాధ్యం కాదు సైకో జగన్" అని సంచల కామెంట్ చేశారు. 

అయితే.. లోకేష్ చేసిన ట్వీట్ కు వైసిపి నాయకురాలు, మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. " మీ డాడీ కేడి..  కాబట్టే అరెస్టు అయ్యాడు పిల్ల సైకో నారా లోకేష్. మంచోడు కాదు సూట్ కేసు కంపెనీలతో ముంచేసినోడు మీ నాన్న చంద్రబాబు. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాకి జైలుకు పంపక జైలర్  సినిమాకి పంపిస్తారా? . పప్పు మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే.. ఈ కుంభకోణంలో విచారణ ను ధైర్యంగా ఎదుర్కోమని చెప్పు.. ఏ వన్ చంద్రబాబు నాయుడిని ఇక ఏ దేవుడు కాపాడలేడు. మీ తాత ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుంది బై బై తుప్పు.. బై బై పప్పు.. " అని మంత్రి రోజా ట్విట్ చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios