జగన్ టికెట్ ఇవ్వకపోయినా డోంట్ వర్రీ .. నగరి సీటును ఎవరికిచ్చినా ఓకే : సిట్టింగ్‌ల మార్పుపై రోజా కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ టికెట్లు నిరాకరించడమో లేదంటే స్థానాలను మార్చడమో చేస్తున్నారు. తాను జగనన్న వెంటే వుంటానని , టికెట్ ఇవ్వలేనని ఆయన చెబితే మనస్పూర్తిగా వదులుకుంటానని రోజా వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ టికెట్లు నిరాకరించడమో లేదంటే స్థానాలను మార్చడమో చేస్తున్నారు. ఈ లిస్టులో మంత్రి రోజా పేరు కూడా వుండటంతో కలకలం రేగింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. 175 స్థానాల్లో గెలవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు తాము సహకరిస్తామన్నారు. అవసరమైతే తన సీటు కూడా త్యాగం చేయడానికి తాను సిద్ధమని రోజా స్పష్టం చేశారు. ఒకసారి ఎమ్మెల్యే అయి ప్రజలకు సేవ చేస్తే చాలు అనుకున్నామని.. అలాంటిది జగన్ తనకు రెండు సార్లు టికెట్లు ఇచ్చారని మంత్రి తెలిపారు.
ఆపై మంత్రిగానూ సీఎం అవకాశం కల్పించారని, వచ్చే ఎన్నికల్లో జగన్ తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదని ఆమె పేర్కొన్నారు. తాను జగనన్న వెంటే వుంటానని , టికెట్ ఇవ్వలేనని ఆయన చెబితే మనస్పూర్తిగా వదులుకుంటానని రోజా వెల్లడించారు. జగన్ పాలన విషయంలో ఎవరూ అసంతృప్తిగా లేరని.. అదంతా మీడియా స్పష్టేనని ఆమె వ్యాఖ్యానించారు. అయితే రోజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి . అధిష్టానం నుంచి టికెట్ లేదని సంకేతాలు అందడంతోనే రోజా నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయని చర్చ జరుగుతోంది.
మరోవైపు.. నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్ మార్పు వ్యవహారం వైసీపీలో అసంతృప్తులకు దారి తీస్తోంది. గాజువాక వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు వ్యవహారం దుమారం రేపుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొద్దిగంటల్లోనే గాజువాక వైసీపీ కో ఆర్డినేటర్ దేవన్ రెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేశారు. దేవన్ తండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి సైతం కుమారుడి బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.