తనను హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.  ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

నిన్న చేసిన వ్యాఖ్యలు ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా చేస్తానని రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు అధికార కార్యక్రమాల్లో పాల్గొనని స్పష్టం చేశారు.

నిమ్మగడ్డ రమేశ్ చౌదరి, చంద్రబాబు కుట్రపూరితంగా చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. నిమ్మగడ్డపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read:మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం: నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు

ఏపీలో పంచాయతీ ఎన్నికలు హాట్ హాట్‌గా సాగతున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కార్ అన్నట్లుగా నడుస్తున్న ఈ వ్యవహారంలో శనివారం ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

తనను టార్గెట్‌ చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్జి చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ .. ఇప్పుడు ఆయన్ను ఏకంగా హౌస్‌ అరెస్ట్‌ చేయాలని డీజీపీకి ఆదేశాలు పంపారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించి పెద్దిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు కారణం.