ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై పలు విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్, వైసీపీ నేత విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

ప్రపంచ దేశాల నుంచి చంద్రబాబు, లోకేష్‌కు అవార్డులు వస్తున్నాయని, అలాంటివారిని బోనెక్కించాలని, ముద్దాయిలు అనడం హాస్యాస్పదమని అన్నారు. ఐదు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అనడానికి నోరెలా వచ్చిందని ప్రత్తిపాటి ప్రశ్నించారు. అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆయన అన్నారు. పాస్‌పోర్ట్ ఏవిధంగా రద్దు చేయిస్తారని మంత్రి విజయసాయిని ప్రశ్నించారు. విపక్షాలకు కేంద్రాన్ని నిలదీసే దమ్ములేదని మంత్రి ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.