బీజేపీ నేతకు లోకేష్ పంచ్..

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 10, Sep 2018, 2:18 PM IST
minister lokesh punch to ex minister manikyalarao
Highlights

కేంద్రంలోని రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్, ప్రధాని మోదీ నిష్పక్షపాతంగా రాష్ట్రానికి ఏవిధంగా మేలు చేయచ్చో.. అలా మేలు చేయడానికి ఎన్ఆర్ఈజీఏ ద్వారా పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావుకి ఏపీ మంత్రి నారా లోకేష్ పంచ్ వేశారు. ఏపీలో శాసన సభ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇందులో ప్రజా సమస్యలను బీజేపీ.. ప్రతిపక్షం లా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. దీనిలో భాగంగా సోమవారం ఎన్ఆర్ఈజీవో గురించి మాణిక్యాలరావు ప్రస్తావించారు.

ముందుగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్‌ నిజాయితీగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఆర్ఈజీఏ గురించి మంత్రి నారా లోకేశ్ మాట్లాడుంటే బాగుండేదన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోకల్లా అత్యధికంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. కేంద్రంలోని రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్, ప్రధాని మోదీ నిష్పక్షపాతంగా రాష్ట్రానికి ఏవిధంగా మేలు చేయచ్చో.. అలా మేలు చేయడానికి ఎన్ఆర్ఈజీఏ ద్వారా పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

 కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలిపేలా మంత్రి లోకేశ్ మాట్లాడితే నిజాయితీగా ఉంటుందని మాణిక్యాల రావు చెప్పుకొచ్చారు. లోకేశ్ మంచి పనులు చేశారని తానెలాగైతే మెచ్చుకుని ధన్యవాదాలు చెప్పానో... అలాగే మంచి జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెబితే బాగుంటుందని లోకేశ్‌‌‌కు మాణిక్యాల రావు సూచించారు.

దీనిపై స్పందించిన లోకేష్.." బీజేపీకి చెందిన శాసనమండలి సభ్యులు అస్తమాను కేంద్రానికి లెటర్లు రాస్తున్నారు. అవినీతి జరిగిపోతోంది.. నీరు చెట్టుకు నిధులు డైవర్ట్ చేస్తున్నారని పదే పదే చెబుతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి.. ఎక్కడా అవినీతి జరగట్లేదు.. కేంద్రంలో ఉన్న మీ బీజేపీ ప్రభుత్వమే మాకు క్లీన్ చిట్ ఇచ్చింది. అకౌంటబిలీటి ట్రాన్‌స్పిరెన్సీలో గడిచిన మూడు సంవత్సరాల్లో మూడు సార్లు ఏపీ మొదటి స్థానంలో ఉంది. బీజేపీ వాళ్లే కాదు.. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కేంద్రానికి లేఖలు రాశారు. కేంద్రానికి పదేపదే ఇలా లేఖలు వస్తుండటంతో సందేహించి చాలా ఆడిట్ టీమ్‌లను పంపింది. ఇప్పటికీ క్రిష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నూటికి నూరుశాతం ఆడిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ఆడిట్ టీమ్ కూడా ఏపీలో ఎలాంటి అవకతవకలు జరగట్లేదని అని తేల్చిచెప్పేసింది. కేంద్ర మంత్రి తోమర్.. యంగ్‌ మినిస్టర్‌గా మంచి పనులు చేస్తున్నావని నన్ను మెచ్చుకున్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువగా నిధులు ఇస్తానని కూడా ప్రోత్సహించారు. ఇది ఆన్ రికార్డ్‌గా చెబుతున్నాను" అని లోకేశ్ అసెంబ్లీలో వివరించారు.

loader