జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ సంస్కృతి గురించి పవన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ సంస్కృతి గురించి పవన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. పవన్ హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదని అన్నారు. అన్నవరం అన్నిరకాలుగా అభివృద్ది చెందుతుందని.. దళారీ వ్యవస్థకు తావులేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. వివాహ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నాడని అన్నారు.
లక్షలు ఖర్చుపెట్టి పెళ్లిళ్లు చేసే స్థోమత ఉన్నవారు కూడా స్వామివారి మీద భక్తితో పిల్లలకు అన్నవరంలో పెళ్లిళ్లు చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్నవరంలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని.. వివాహాలు జరిగే తీరును క్రమబద్దీకరించామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించామని చెప్పారు.
రాష్ట్రంలో దేవాలయాలు కూల్చింది పవన్ దత్తతండ్రి చంద్రబాబు నాయుడేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఆలయాలు కూల్చినప్పుడు పవన్ కళ్లు మూసుకున్నారా? అని ప్రశ్నించారు. అప్పుడు కోర్టులో ఎందుకు కేసు వేయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే పవన్ చూడలేకపోతున్నారని మండిపడ్డారు.
