Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ జిల్లా.. నిమ్మకూరు వాసుల కోరిక, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: కొడాలి నాని

పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్వ్యస్ధీకరణ చేపట్టామని కొడాలి నాని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పాలన జగన్ అందిస్తున్నారని మంత్రి కొనియాడారు. కృష్ణా జిల్లాకు (krishna district) ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిమ్మకూరు వాసులు కోరారని.. ఎన్టీఆర్ (ntr) అభిమానుల తరపున సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

minister kodali nani thanked to cm ys jagan over NTR Name For new District
Author
Amaravathi, First Published Jan 27, 2022, 6:48 PM IST

ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే సీఎం జగన్ (ys jagan) లక్ష్యమన్నారు మంత్రి కొడాలి నాని (kodali nani). గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కొడాలి నాని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని  కొడాలి నాని ప్రశంసించారు. గిట్టుబాటు ధర కోసం ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోళ్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

గ్రామ సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని మంత్రి వెల్లడించారు. అధికార వింకేంద్రీకరణ కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని.. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్వ్యస్ధీకరణ చేపట్టామని కొడాలి నాని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పాలన జగన్ అందిస్తున్నారని మంత్రి కొనియాడారు. కృష్ణా జిల్లాకు (krishna district) ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిమ్మకూరు వాసులు కోరారని.. ఎన్టీఆర్ (ntr) అభిమానుల తరపున సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి మంగళవారం నాడు ఆమోదం  తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం Notification  విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ పై ప్రజలు తమ సూచనలు,సలహాలతో పాటు అభిప్రాయాలను తెలపాలని ప్రభుత్వం కోరింది. వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలకు గడువును ఇచ్చింది. ఉగాది నుండి కొత్త జిల్లాల నుండి పాలన సాగించాలని జగన్ సర్కార్ తలపెట్టింది. ఇదే విషయాన్ని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కూడా గవర్నర్ ప్రస్తావించారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు YS Jagan హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.. అరకు ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. అరకు పార్లమెంట్ స్థానం నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో  ఈ ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గతంలోనే జీవోను జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios