జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైరయ్యారు. పవన్ ఏమనుకున్నా డోంట్ కేర్ అన్నారు. తంతే పవన్ వెళ్లి పక్కదేశంలో  పడతాడని.. భయపడటానికి ఇది సినిమా కాదన్నారు.

చంద్రబాబుకు ఆపద వస్తే పవన్ వచ్చేస్తాడని.. బాబు, పవన్ కలిసినా ఏం చేయలేరని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కోసం తప్ప పవన్ రైతుల గురించి మాట్లాడడని.. జనసేనాని చంద్రబాబు చొక్కా పట్టుకోవాలని నాని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే చదువుతాడని.. ప్యాకేజ్ తీసుకుని మాట్లాడతాడని మంత్రి ఆరోపించారు. పవన్ వార్నింగ్‌లు ఇవ్వడమేంటి..? భయపడేది లేదని నాని స్పష్టం చేశారు. జగన్‌ను ఒక్క మాటంటే.. మేం పది మాటలు అంటామని కొడాలి నాని హెచ్చరించారు. నోటికి వచ్చినట్లు పవన్ కల్యాణ్‌ మాట్లాడొద్దని నాని హితవు పలికారు. 

నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ గుడివాడ, మచిలీపట్నంలలో సోమవారం పర్యటించారు పవన్. మంత్రి కొడాలి నానిపై పంచ్ డైలాగులతో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి? నానియా? వైసీపీలో నానీలు ఎక్కువమంది. ఏదో ఒక నాని. ఏ నానో నాకు అర్థం కావడం లేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం అంటూ కామెంట్ చేశారు. దీంతో కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

తమకు ఏ మతమైనా ఒకేటనని.. శివ లింగం, బోడి లింగం ఎవరో ప్రజలు ఇప్పటికే నిర్ణయించారన్నారు మంత్రి నాని. శివ లింగం కాబట్టి జగన్‌ను ప్రజలు గెలిపించారని.. బోడి లింగం కాబట్టి రెండు చోట్లు ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ పార్టీ పెట్టి వ్యాపారం చేసిన ఆదర్శ పురుషుడు పవన్ కళ్యాణ్ అంటూ మండిపడ్డారు. వకీల్ సాబ్ అంటే జగన్‌కు తెలియదు.. ఆయన వకీల్ సాబ్ అనుకుంటున్నారు.. జనాలు మాత్రం షకీలా సాబ్ అనుకుంటున్నారని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.