జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో గ్రామ దర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మితే తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ రిటైల్‌గా జనసేనను అమ్మడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. 

ఉండి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో గ్రామ దర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మితే తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ రిటైల్‌గా జనసేనను అమ్మడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. 

వన్‌ కళ్యాణ్‌ ఏమైనా ప్రభాస్‌ లా లేక ఇంకొకరి లా ఆరడుగుల అందగాడా, ఆజానుబాహుడా అని ప్రశ్నించారు. ఊరికి 20 మంది పవన్ కళ్యాణ్ కన్నా అందగాళ్లు ఉన్నారని విమర్శించారు. పవన్‌ వారసత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన అన్న చిరంజీవి నుంచి వచ్చిన వారసత్వం ద్వారానే పవన్ పైకొచ్చారని అది నిజం కాదా అని ప్రశ్నించారు. 

వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే పవన్‌ కల్యాణ్‌ ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు. చిరంజీవి సినిమా యాక్టర్‌ కాకపోతే పవన్‌ కల్యాణ్‌ ఎవరు, ఎక్కడుండేవారని ప్రశ్నించారు. చిరంజీవి కుటుంబంలో పదిమంది వరకు సినిమా యాక్టర్లు వచ్చారని అది సినీ వారసత్వం కాదా అని నిలదీశారు. రాజకీయ వారసత్వం గురించి మాట్లాడే అర్హత పవన్‌ కల్యాణ్‌కు లేదని జవహర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.