కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం అమలాపురం హింసాత్మక ఘటనలకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి దాడిశెట్టి రాజా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్‌లపై విరుచుకుపడ్డారు. 

కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం అమలాపురం హింసాత్మక ఘటనలకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి దాడిశెట్టి రాజా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్‌లపై విరుచుకుపడ్డారు. పక్కా ప్లాన్ ప్రకారమే అమలాపురంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు. మంచి నాయకుడిలా నటించే చంద్రబాబు విలన్ అని విమర్శించారు. ప్రశాంతమైన కోనసీమలో చంద్రబాబు, పవన్ చిచ్చుపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురం విధ్వంసం వెనక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. కుట్రలు పన్నడం చంద్రబాబుకు అలవాటేనని.. పక్కా ప్లాన్‌ ప్రకారమే విధ్వంసం సృష్టించారన్నారు. 

అంబేడ్కర్‌ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేయలేదా..?, అంబేడ్కర్‌ పేరు పెట్టాలని జనసేన దీక్షలు చేయలేదా..? అని మంత్రి ప్రశ్నించారు. గతంలో తుని ఘటనకు చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. ఈ ఘటనకు కూడా చంద్రబాబే కారణమని ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని చంద్రబాబే గొడవలు సృష్టించారన్నారు. కోనసీమ ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తామని.. నిందితులెవరైనా వదిలేది లేదని అన్నారు. 

అసలేం జరిగింది.. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లా పేరు మార్చుతూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి అభ్యతంరాలను స్వీకరించేందుకు నెల రోజుల సమయం కేటాయించింది. అన్ని రాజకీయ పార్టీల డిమాండ్‌ మేరకు కొత్త జిల్లా పేరు మార్చాలనే ప్రతిపాదనను తీసుకొచ్చామని మంత్రి విశ్వరూపు తెలిపారు. అయితే కొనసీమ జిల్లా పేరును మార్చడంపై కోనసీమ సాధన సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. కోనసీమ పేరునే కొనసాగించాలని కోరుతూ.. మంగళవారం నిరసననలకు పిలుపునిచ్చింది. 

అయితే ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొంతమంది ఆందోళనకారులు మంత్రి పి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా కొన్ని వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో కనీసం 20 మంది పోలీసులు గాయపడ్డారు. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి గాయపడి అపస్మారక స్థితిలో పడిపోయారు. ఆందోళనకారులతో జరిగిన ఘర్షణలో కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తలకు గాయమైంది. మరోవైపు ఆందోళనకారులు కూడా పదుల సంఖ్యలో గాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణంలో దహనం జరిగింది మరియు కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్‌గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు మంగళవారం, మే 24, ఆంధ్ర మంత్రి పి విశ్వరూపు మరియు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పి.సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా. నిరసనలను అదుపు చేసేందుకు లాఠీచార్జి చేయడంతో పోలీసులతో సహా డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు.

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను కొనసీమ జిల్లా రప్పించారు. అమలాపురంలో సెక్షన్ 144 CrPC కింద నిషేధాజ్ఞలు విధించారు. అమలాపురం చేరుకున్న ఏలూరు రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి పాలరాజు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గాయపడిన పోలీసు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. 

అమలాపురంలో హింసాత్మక ఘటనల వెనుక ఏవో శక్తులున్నాయని అధికార పక్షం ఆరోపిస్తుండగా.. పరిస్థితిని అదుపు చేయడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. ప్రజలు సంయమనం పాటించి కోనసీమలో శాంతి నెలకొనాలని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందున డాక్టర్‌ అంబేద్కర్‌ పేరును తొలగించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.