సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే సీపీఎస్‌తో ఇబ్బందులున్నాయి కాబట్టే.. కొత్త స్కీమ్‌ను తెచ్చినట్టుగా చెప్పారు.
సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే సీపీఎస్‌తో ఇబ్బందులున్నాయి కాబట్టే.. కొత్త స్కీమ్‌ను తెచ్చినట్టుగా చెప్పారు. కొత్త స్కీమ్ సీపీఎస్‌ను మించి ఉంటుందన్నారు. సమస్యను అందరూ సానుకూలంగా అర్థం చేసుకోవాలని కోరారు. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అన్ని శాఖల్లో అమలు చేస్తామని చెప్పారు. ఉద్యమాల్లో అరెస్ట్ అయి ఉంటే.. అలాంటి ఉద్యోగులకు నోటీసులిస్తున్నారని బొత్స చెప్పారు.
ఉద్యోగుల మిలియన్ మార్చ్ సంగతి తనకు తెలియదని మంత్రి బొత్స అన్నారు. సమస్యలపై పోరాటం చేసే హక్కు ఉద్యోగ సంఘాలకు ఉందని చెప్పారు. అయితే సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే ఊరుకుంటామా అని కామెంట్ చేశారు.
ఇక, ఏపీ ప్రభుత్వ వైఖరిపై సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటికీ రద్దు చేయలేదని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారు..విజయవాడలో సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ నిర్వహించాలని చూస్తున్నారు. సీఎం ఇంటిని ముట్టడిస్తామని చెబుతున్నారు. మరో వైపు మంత్రలు కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరుపుతూనే ఉంది.
