భోగాపురం విమానాశ్రయంపై విమర్శలు .. వాళ్లకొచ్చిన బాధేంటీ: టీడీపీ నేతలకు కౌంటరిచ్చిన మంత్రి బొత్స

భోగాపురం విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.  చంద్రబాబులా జగన్‌ది కంపు కొట్టే నోరు కాదని.. తమ ప్రాంతం మీద అక్కసు ఎందుకని సత్యనారాయణ ఫైర్ అయ్యారు. 

minister botsa satyanarayana counter to tdp leaders over bhogapuram airport ksp

భోగాపురం విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆశను రేకెత్తించే  బృహత్తర పథకానికి , భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం జగన్ శంఖుస్థాపన చేశారని అన్నారు. ఉత్తరాంధ్రవాసిగా, బాధ్యత గల పౌరుడిగా  సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బొత్స చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భోగాపురం శంకుస్థాపన  అయిన  వెంటనే అక్కసు వెళ్లగక్కారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు చూడాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయం కోసం 12వేల ఎకరాలు కావాలని చంద్రబాబు అడగలేదా అని బొత్స ప్రశ్నించారు. 

ఇవాళ రైతులు బలవంతంగా భూములు లాక్కున్నారని చెప్పారా అని సత్యనారాయణ నిలదీశారు. కోర్ట్ లిటిగేషన్లు,  ఇబ్బందులను అధిగమించి ఎయిర్‌పోర్ట్‌కు శంఖుస్థాపన చేశామని మంత్రి తెలిపారు. చంద్రబాబుకు ఏదైనా రాజకీయమేనని, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగితే టీడీపీకి బాధేంటీ అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు గంటకో మాట మాట్లాడుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభంపై టీడీపీ నేతలకు కడుపు మండుతోందని ఆయన చురకలంటించారు. 

Also Read: సాక్ష్యాలుంటే జగన్ మమ్మల్ని బతకనిచ్చేవాడా?: సుప్రీం తీర్పుపై బాబు రియాక్షన్

విమానాశ్రయం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు సమదూరంలో వుంటుందని బొత్స పేర్కొన్నారు. రైతులను సంప్రదించాకే భూములను సేకరించామని, తాను కూడా స్థానికులతో సమావేశమైనట్లు సత్యనారాయణ గుర్తుచేశారు. మూడేళ్లలో భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఆ ప్రాంత నేతలు కానీ సీఎం కానీ స్వయంగా రైతులను సంప్రదించారా అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబులా జగన్‌ది కంపు కొట్టే నోరు కాదని.. తమ ప్రాంతం మీద అక్కసు ఎందుకని సత్యనారాయణ ఫైర్ అయ్యారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దంటారని.. ఆ ప్రాంతానికి అధికారంలో వున్నప్పుడు మీరేం ఉద్ధరించారని బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios