అప్పుడో రకంగా.. ఇప్పుడో రకంగా, నోరా తాటిమట్టా: బాబుపై బొత్స వ్యాఖ్యలు
ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా.. అధికారంలో ఉంటే ఒకలాగా మాట్లాడతారని అది నోరా తాటి మట్లా అంటూ ఆయన ఫైరయ్యారు. టీడీపీ తాబేదార్లు, సామాజిక వర్గం కోసం రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు తగులబెట్టారని బొత్స మండిపడ్డారు.
ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా.. అధికారంలో ఉంటే ఒకలాగా మాట్లాడతారని అది నోరా తాటి మట్లా అంటూ ఆయన ఫైరయ్యారు. టీడీపీ తాబేదార్లు, సామాజిక వర్గం కోసం రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు తగులబెట్టారని బొత్స మండిపడ్డారు. ఉత్తరాంధ్ర నేతలు ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు వెనకాల నిలబడ్డారని సత్యనారాయణ నిలదీశారు.
విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు చులకన భావంతో మాట్లాడుతున్నారని మంత్రి బొత్స ఆరోపించారు. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న విశాఖను, వెనుకబాటుతో ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వికేంద్రీకరణకు మొగ్గుచూపారని మంత్రి స్పష్టం చేశారు.
Aslo Read:చంద్రబాబు అరెస్ట్: విశాఖకు భువనేశ్వరి, ఆరోగ్యంపై ఆరా
ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదని, ఆయన అడుగులకు మడుగులొత్తాలని, దాసోహం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని బొత్స ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలను ఉన్మాదులని, పెయిడ్ ఆర్టిస్టులని బాబు సంబోధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
శాంతికి మారుపేరైన ఆ ప్రాంతంలో పార్టీ రౌడీలు, గుండాల ద్వారా అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించాలని చంద్రబాబు భావిస్తున్నారని బొత్స ఆరోపించారు.
ఇంకో ఐదేళ్లలో ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ధీటుగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని అలా జరగకూడదని, ఆటంకాలు కలిగించాలని చంద్రబాబు యత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు.
Also Read:చంద్రబాబుకు షాక్: విశాఖ పర్యటనకు గంటా శ్రీనివాస రావు డుమ్మా
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని అక్కడి ప్రజలు స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకున్నారని.. ఎంత సౌమ్యంగా ఉంటారో హక్కుల విషయంలో పోరాడుతుందని ఆయన గుర్తుచేశారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా బాబుకు ఇలాంటి స్వాగతాలే ఎదురవుతాయని బొత్స ఎద్దేవా చేశారు.