గత ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కుంటుపడిందన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకటో తేదీనే జీతాలిస్తున్నామని బొత్స స్పష్టం చేశారు.

మున్సిపల్ శాఖలో రూ.15 వేల కోట్ల బకాయిలున్నాయని.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. బొగ్గు కొరత కారణంగానే విద్యుత్ కొతలు ఎదురవుతున్నాయని బొత్స స్పష్టం చేశారు.

ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.