ఒంగోలు: గ్యాంగ్ రేప్‌కు  గురైన బాధితురాలిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదివారం నాడు పరామర్శించారు. బాధితురాలికి అవసరమైన  వైద్య సహాయం అందించాలని మంత్రి  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు.

మరో వైపు ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్  చెప్పారు.  నిందితుల్లో ముగ్గురు మైనర్లని ఆయన  చెప్పారు. 

ఆర్టీసీ బస్టాండ్‌లో స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్న మైనర్  బాలికకు మాయమాటలకు నమ్మించారు. ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీవరకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.