వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై స్పందించారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ గుర్తుపై ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు సైకోలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీలో వుంటూ జగన్ బొమ్మతో గెలిచి ఇలా మాట్లాడటం సరికాదని బాలినేని హితవు పలికారు. రఘురామ అరెస్ట్ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి స్పష్టం చేశారు. 

కాగా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును శుక్రవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈమేరకు హైద్రాబాద్‌లోని రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్

హైద్రాబాద్ నుండి ఎంపీని ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నారు. అంతకుముందు సీఐడీ పోలీసులతో రఘురామకృష్ణమ రాజు వాగ్వివాదానికి దిగారు. సెక్యూరిటీ సిబ్బంది రఘురామ కృష్ణమ రాజు చుట్టూ వలయంగా ఏర్పడి అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ పై అధికారుల ఆదేశాలు వచ్చేవరకు అరెస్టు చేయడానికి అనుమతించబోమని వారు చెప్పారు.