Asianet News TeluguAsianet News Telugu

వాటాలు, దోపిడీలు, దొడ్దిదారిన పదవులు : నారా లోకేశ్‌పై అంబటి రాంబాబు ఆరోపణలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. కమీషన్ల కోసమే కాఫర్ డ్యాం లేకుండా డయాఫ్రం వాల్ కట్టారని ఆయన ఆరోపించారు. 
 

minister ambati rambabu sensational comments on tdp leader nara lokesh
Author
First Published Jan 19, 2023, 3:08 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై ఆరోపణలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే కాఫర్ డ్యాం లేకుండా డయాఫ్రం వాల్ కట్టారని ఆరోపించారు. ప్రాజెక్ట్‌లకు డబ్బులు వెచ్చించడం, వాటాలు కొట్టడం, దోపిడీలు చేయడం , దొడ్డిదారిన పదవులు చేపట్టడం మీకు మీ కుమారుడికి అలవాటేనని అంబటి దుయ్యబట్టారు. మీ కన్నా వందరెట్లు నిజాయితీపరుడ్ని గుర్తుపెట్టుకోవాలంటూ మంత్రి హితవు పలికారు. 
 
ఇకపోతే.. సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ప్రైవేట్ కేసు ఆధారంగా కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఫ్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. 

ALso REad: మీరు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే.. కానీ ముఖానికి రంగు వేయను: నాగబాబుకు మంత్రి అంబటి కౌంటర్

రాంబాబు నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు సత్తెనపల్లి, గుంటూరు నగరంలో సంక్రాంతి లక్కీ డ్రా టిక్కెట్లను ఒక్కొక్కటి రూ.100 చొప్పున విక్రయిస్తున్నారని గాదె వెంకటేశ్వరరావుఆరోపించారు. మూడు లక్షలకు పైగా టిక్కెట్లను ముద్రించి పార్టీ కార్యకర్తలు, వార్డు సచివాలయ వాలంటీర్ల ద్వారా విక్రయిస్తున్నారని అన్నారు. పింఛన్‌ కానుక లబ్ధిదారులను వార్డు వాలంటీర్లు టిక్కెట్లు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన గుంటూరు కోర్టు మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో తాజాగా సత్తెనపల్లి పోలీసులు మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios