‘‘ మోయటానికి ఎందుకులే భేటీలు ’’.. సీట్ల కోసమో, నోట్ల కోసమో : చంద్రబాబు - పవన్ భేటీపై అంబటి సెటైరికల్ కార్టూన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ల భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘‘మోయటానికి ఎందుకులే భేటీలు ’’ అంటూ.. నారా లోకేష్, చంద్రబాబులను పవన్ కళ్యాణ్ తన భుజాలపై మోస్తున్న కార్టూన్‌ను రాంబాబు ట్వీట్ చేశారు.

minister ambati rambabu satirical cartoon on tdp chief chandrababu naidu and janasena president pawan kalyan meeting ksp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ల భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘‘మోయటానికి ఎందుకులే భేటీలు ’’ అంటూ.. నారా లోకేష్, చంద్రబాబులను పవన్ కళ్యాణ్ తన భుజాలపై మోస్తున్న కార్టూన్‌ను రాంబాబు ట్వీట్ చేశారు. అనంతరం ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీరిద్దరూ భేటీ కావడం కొత్త కాదన్నారు. సీట్ల కోసం భేటీ అయ్యారో, నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలంటూ అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారని.. అలాంటిది ఇంకా సీట్ల పంచాయతీ తేల్చుకోలేకపోయారంటూ రాంబాబు దుయ్యబట్టారు. సిద్ధం అని జగన్ అంటుంటే.. ఈ రెండు పార్టీల నుంచి సమాధానం లేదన్నారు. 

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని.. తమ టార్గెట్ గెలవటం కాదని, 175 సీట్లు గెలవటమేనని రాంబాబు తెలిపారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లు ఓడిపోవాలన్నదే తమ టార్గెట్ అని.. జగన్‌ను ఓడించడం వారి వల్ల కాదని, పేదలంతా తమకు అండగా వున్నారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసినా వైసీపీదే విజయమని.. ఎన్నికల ముందు నేతలు పార్టీలు మారటం సాధారణ విషయమేనని రాంబాబు చెప్పారు. 

కాగా.. ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు సీట్ల పంపకాలు, ప్రచారం, ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. ఫిబ్రవరి 14న ఉమ్మడి అభ్యర్ధుల మొదటి జాబితాను ప్రకటించాలని ఇద్దరు నేతలు భావిస్తున్నారు. అలాగే బీజేపీని కూటమిలో చేర్చేందుకు పవన్ త్వరలో వెళ్లనున్నారు. ఆ పార్టీ వస్తే ఓకే, లేనిపక్షంలో ఫిబ్రవరి 14న మొదటి జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios