చంద్రబాబు సీట్లో కూర్చోవయ్యా బాబు... మేము కోరుకునేది అదే: బాలకృష్ణతో అంబటి (వీడియో)

అసెంబ్లీలో చంద్రబాబు సీటు పైకెక్కి విజిల్ ఊదుతూ ఆందోళన చేపట్టిన నందమూరి బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

Minister Ambati Rambabu satires on Nandamuri Balakrishna AKP

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ టిడిపి సభ్యులు ఆందోళనలు, వైసిపి సభ్యుల మాటలదాడితో దద్దరిల్లిపోతోంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం అక్రమకేసులు పెట్టి జైలుకు పంపిందని... ఈ అరెస్ట్ పై చర్చ జరపాలంటూ టిడిపి పట్టుబడుతోంది. ఇందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించకపోవడంతో టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ చంద్రబాబు కుర్చీవద్దకు చేరుకుని విజిల్ ఊదుతూ నిరసన తెలిపాడు. ఇలా అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహారతీరుపై స్పందిస్తూ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  

ఇవాళ బాలకృష్ణకు మంచి అవకాశం వచ్చినా ఉపయోగించుకోవడం లేదని మంత్రి అంబటి అన్నారు. చంద్రబాబు కుర్చీలో నించుని ఈలలు ఊదడం కాదు... ఆ సీట్లో కూర్చోవాలని బాలకృష్ణకు సూచించారు. ఇదే మంచి అవకాశం... కూర్చోవయ్యా అంటే కూర్చోనంటున్నాడని అన్నారు. తండ్రి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడు బాలకృష్ణ బావకే మద్దుతిచ్చాడనే అపవాదు వుంది... తండ్రికి అన్యాయం చేసాడని అంబటి అన్నారు. ఇప్పుడయినా చంద్రబాబు కుర్చీలో కూర్చోవాలని... తాము అదే కోరుకుంటున్నామని మంత్రి అంబటి అన్నారు.  

వీడియో

బాలకృష్ణ మాత్రం బావ కుర్చీలో కూర్చోకుండా లేచి నిలబడి విజిల్స్ వేస్తూ సభను అవమానిస్తున్నారని అంబటి మండిపడ్డారు. అసలు బాలకృష్ణకు ఏం కావాలో ఆయనకే అర్థంకావడంలేదని అన్నారు. ఆయనతో పాటు టిడిపి సభ్యుల తీరు చాలా అభ్యంతకరంగా వుందని... వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు మంత్రి అంబటి. బాలకృష్ణపై అంబటి సెటైర్లు వేస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముసిముసిగా నవ్వుతూ కనిపించారు.

Read More  చంద్రబాబు కుర్చీలో బాలకృష్ణ కూర్చోవడం దేనికి సంకేతం: అసెంబ్లీలో పేర్నినాని

వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మదుసూధన్ కూడా చంద్రబాబు కుర్చీ ఎక్కి బాలకృష్ణ నిరసన తెలపడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తండ్రిని వెన్నోపోటు పొడిచి సీఎం సీట్లో కూర్చున్నా బావను ఏం చేయలేకపోయిన బాలకృష్ణ కనీసం అసెంబ్లీలో అయినా చంద్రబాబు కుర్చీ ఎక్కాడన్నారు. ఇది పైనుంచి చూసిన ఎన్టీఆర్ సంతోషపడి వుంటారన్నారు. నందమూరి కుటుంబసభ్యులు కూడా బాలకృష్ణను చంద్రబాబు కుర్చీపై చూసి ఆనందపడి వుంటారన్నారు వైసిపి ఎమ్మెల్యే మదుసూధన్. 

కాలేజీలో అమ్మాయిలను చూసి పోకిరీలు విజిల్స్ వేసినట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని వైసిపి ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్లూట్ మీ బావ చంద్రబాబులాంటి జింకల ముందు ఊదితే బావుంటుంది... సింహం లాంటి జగన్ ముందు కాదని బాలకృష్ణను హెచ్చరించాడు. బాలకృష్ణ, ఆయన బావ చంద్రబాబు అసలైన సైకోలే కాదు పిచ్చోళ్ళు కూడా అంటూ ఎమ్మెల్యే మదుసూధన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మధుసూదన్. 
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios