తప్పు చేస్తే అరెస్ట్ తప్పదు.. ఆయనేమైనా పెద్ద మగాడా : చంద్రబాబుపై మంత్రి అంబటి విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. అరెస్ట్ చేయకుండా వుండటానికి చంద్రబాబు ఏమైనా పెద్ద మగాడా అంటూ రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఐటీ నోటీసులంటే ఎందుకంట భయమని సెటైర్లు వేశారు. దొంగతనం చేశానని తెలిసే ఆయన భయపడుతున్నాడని.. నోటీసులు ఇచ్చిన వారిని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ముడుపులు తీసుకున్న విషయాన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే అధికారులు నోటీసులు ఇచ్చి వుంటారని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. తనను అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని మంత్రి పేర్కొన్నారు. అరెస్ట్ చేయకుండా వుండటానికి చంద్రబాబు ఏమైనా పెద్ద మగాడా అంటూ రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తప్పు చేసిన వారు దుబాయ్ వెళ్లినా, అమెరికా వెళ్లినా అరెస్ట్ ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయని మంత్రి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 122 ఏళ్లలో ఎన్నడూ ఈ పరిస్ధితి లేదని.. దీనికి చంద్రబాబే కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారని మంత్రి దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల వద్ద ఆయన పాదం పెట్టడం వల్లే ప్రాజెక్ట్‌లు ఎండిపోతున్నాయని.. ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో ఆరు తడి పంటలపై దృష్టి పెట్టాలని అంబటి రాంబాబు రైతాంగానికి సూచించారు.
ALso Read: సానుభూతి కోసం ప్రయత్నాలు.. చంద్రబాబు దొంగైనా పవన్ అంగీకరించడు: మంత్రి అంబటి
నిన్న అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు సానుభూతి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి సానుభూతి రాజకీయాలు ఇప్పుడు చెల్లవని చెప్పారు. కారణం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు. చంద్రబాబు తప్పు చేస్తే శిక్ష పడటం తప్పదని అన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే వదిలిపెడతారని చెప్పారు.
చంద్రబాబు దొంగ అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒప్పుకోడని.. హీరో అనే అంటాడని సెటైర్లు వేశారు. అందుకు వారిద్దరి మధ్య ఉన్న బంధం అలాంటిదని విమర్శించారు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్న పవన్ కల్యాణ్ నోరు విప్పరని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్.. పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసుడు, దత్త రాక్షసులని విమర్శలు గుప్పించారు.
డెల్టాలో వరి నాట్లకు ఇబ్బంది లేదని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. అవసరమైతే వారా బంది నిర్వహిస్తామని తెలిపారు. శ్రీశైలం, నాగర్జున సాగర్, పులిచింత ప్రాజెక్టులలో పూర్తిస్థాయి నీరు లేదని చెప్పారు. సాధారణం కంటే మైనస్ 31 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. నాగార్జున సాగరల్‌లో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. సాగర్ ఆయకట్టు రైతులు వరి పంట వేయద్దని సూచించారు. రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని కోరారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.