పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆస్పత్రిలో కరోనా రోగి మృతిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విచారణకు ఆదేశించారు. డీఎంహెచ్‌వో, ఆశ్రమం హాస్పిటల్‌ డాక్టర్‌తో ఆయన మాట్లాడారు. 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆస్పత్రిలో కరోనా రోగి మృతిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విచారణకు ఆదేశించారు. డీఎంహెచ్‌వో, ఆశ్రమం హాస్పిటల్‌ డాక్టర్‌తో ఆయన మాట్లాడారు. పేషెంట్ ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై ఆళ్ల నాని మాట్లాడుతూ.. మృతుడి బంధువుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కాగా, కరోనా పాజిటివ్‌ వచ్చిన ఓ వ్యక్తి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్‌ చేరాడు. దాదాపు నెల రోజుల పాటు చికిత్స తీసుకుని మృతి చెందాడు.