ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఇంట పెళ్లి సందడి మొదలైంది. బంధువులతో ఇల్లు కళకళలాడుతోంది. సోమవారం మంత్రి భూమా అఖిల ప్రియ, పెళ్లికుమారుడు భార్గవ్‌రామ్‌ల మెహందీ వేడుకలు జరిగాయి. ఇద్దరికీ బంధు మిత్రులు పేరంటం చేశారు. వచ్చిన వారికి రకరకాల విందు వంటలను వడ్డిస్తున్నారు. మామ ఎస్వీ మోహన్‌రెడ్డి, అన్నయ్య భూమా బ్రహ్మానందరెడ్డి పెళ్లి వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. వచ్చిన అతిథులను దగ్గరుండి ఆహ్వానిస్తున్నారు. ఆళ్లగడ్డలో ఈ నెల 29న జరగనున్న వివాహ వేడుకకు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, పలువురు ప్రముఖులు రానుండడంతో అధికారులు సోమవారం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.