ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (ys jagan mohan reddy) జరిగిన భేటీలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారని.. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (adimulapu suresh) . 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (ys jagan mohan reddy) జరిగిన భేటీలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారని.. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (adimulapu suresh) . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చని సూచించారు. రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు.

కాగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Corona కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారానికి ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెక్ పెట్టారు. రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే ఆలోచన లేదని ఏపీ మంత్రి సురేష్ తేల్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 17 నుండి 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీ రాస్ట్రంలో కూడా విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారానికి మంత్రి సురేష్ పుల్‌స్టాప్ పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం నాడు రాష్టంలో 4 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కోడి పందెలు, గుండాటలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈ నెల 10వ తేదీ నుండే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. అయితే సంక్రాంతిని పురస్కరించుకొని ఈ నెల 18 నుండి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను నైట్ కర్ఫ్యూతో పాటు మరికొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు.50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌, మాల్స్ ఓపెన్ చేయనున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని జగన్ సర్కార్ ఆదేశించింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు పోలీసులకు సూచించారు.మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలన్నారు. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలన్నారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదని ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని ప్రభుత్వం ఆదేశించింది.