మంగళగిరి : ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీల్ వైద్య విద్యార్ధి ఆత్మహత్య.. అదనపు ఫీజు కోసం వేధింపులతోనే..?
గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు ఫీజు కోసం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎంవీ రావు వేధింపులతోనే అతను బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని యశ్వంత్‌గా గుర్తించారు. కాలేజ్ యాజమాన్యం ఒత్తిళ్లతోనే ఇతను బలవన్మరణానికి పాల్పడినట్లుగా తోటి విద్యార్ధులు చెబుతున్నారు. అదనపు ఫీజు కోసం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎంవీ రావు వేధింపులకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన యశ్వంత్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.