భర్తతో సంబంధం పెట్టుకుందని.. ముఖాన టీ పోసి, జుట్టు కత్తిరించి వార్నింగ్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 7, Sep 2018, 11:39 AM IST
Married women warns to another women to stop illegal afair with her husband
Highlights

తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భార్య మరో మహిళ ముఖాన టీ విసిరికొట్టడంతో పాటు చావబాదింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన సూరిబాబు, ప్రియాంక భార్యభర్తలు. భర్త తనకు తెలియకుండా అదే గ్రామానికి చెందిన చిలకమ్మ అనే వివాహితతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని అనుమానిస్తోంది. 

ఈ క్రమంలో గురువారం తన బంధువులు, స్నేహితులతో కలిసి కోపంగా చిలకమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో వాగ్వివాదానికి దిగింది. సహనం నశించిన ప్రియాంక తన వెంట తెచ్చుకున్న వేడి వేడి టీని చిలకమ్మ ముఖాన కొట్టింది. అక్కడితో ఆగకుండా కొడవలితో ఆమె జుట్టుకత్తిరించి చావబాదింది.

వెంటనే అక్రమ సంబంధాన్ని ఆపివేయాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ సమయంలో ఇద్దరు మహిళల భర్తలు పక్కనే ఉండి వినోదాన్ని చూశారు తప్పించి కలగజేసుకోలేదు. జరిగిన ఘటనపై చిలకమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ప్రియాంకపై ఐపీసీ సెక్షన్ 448, 324, 354 కింద కేసు నమోదు చేశారు.

loader