Asianet News TeluguAsianet News Telugu

అమ్మా.. ఆకలేస్తోంది లేమ్మా

తెల్లవారి లేచిన పిల్లలు తల్లిన లేపినా లేవకపోవడంతో ఆకలితో గోలపెట్టారు. ఇంతలో ఫోన్‌ మెసేజ్‌ ద్వారా నగరంలో అందుబాటులో ఉన్న వారి బంధువులు చేరుకుని ఆ చిన్నారులను చేరదీశారు.

married women commit suicide in vizag
Author
Hyderabad, First Published Sep 15, 2018, 12:02 PM IST

చావు అంటే ఏంటో కూడా తెలియని వయసు వాళ్లది. రాత్రి తమతో కలిసి నిద్రపోయిన తల్లి.. తెల్లారి లేపినా లేవకపోయే సరికి ఏం జరిగిందో వాళ్లకు అర్థం కాలేదు. వాళ్ల కన్నతల్లి కానరాని లోకాలకు వెళ్లిపోయిందన్న విషయం తెలీక.. ఆకలేస్తోంది లేవని అడుగుతున్నారు. ఈ హృదయవిదారకర ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయనగరం జిల్లా చీపురుపల్లి దరి పెంటలింగాపురానికి చెందిన బమ్మడిపాటి గోపీకృష్ణ కిరణ్‌కుమార్‌కు, అదే జిల్లా గరివిడి దరి పెదబంటుపల్లికి చెందిన ఉమ(26)తో 2012లో వివాహమైంది. గోపీకృష్ణ విశాఖ నగరంలో ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో పని చేస్తున్నాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్లు వయస్సున్న సాయి, లడ్డూ అనే మగపిల్లలున్నారు. వీరంతా కొన్నాళ్లుగా మూడో వార్డు పరిధి రవీంద్రనగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఇంట్లో చిన్నచిన్న గొడవలు అప్పుడప్పుడూ జరుగుతుండేవని స్థానికులు చెప్పారు. అయితే ఈ గొడవలు పెద్దల వరకు చేరలేదు. 

ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారేసరికి ఉమా చీరతో కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఆమె భర్త గోపీకృష్ణ వరసకు తోడల్లుడు అయ్యే బంధువుకు ‘ఉమా ఆత్మహత్య చేసుకొంది.. వెంటనే రావలెను’ అని సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ చేశారు. అనంతనం అక్కడే మృతదేహాన్ని, నిద్రపోతున్న చిన్నారులను వదిలేసి పరారయ్యాడు. తెల్లవారి లేచిన పిల్లలు తల్లిన లేపినా లేవకపోవడంతో ఆకలితో గోలపెట్టారు. ఇంతలో ఫోన్‌ మెసేజ్‌ ద్వారా నగరంలో అందుబాటులో ఉన్న వారి బంధువులు చేరుకుని ఆ చిన్నారులను చేరదీశారు.

అనంతరం విజయనగరం నుంచి మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు అక్కడికి చేరుకున్నారు. ఏసీపీ రామచంద్రరావు, ఆరిలోవ సీఐ సీహెచ్‌.తిరుపతారావు, ఎస్‌ఐ పాపారావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. బంధువుల అనుమతితో మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

తన కుమార్తె ఉమా(26)ను అల్లుడు గోపీకృ ష్ణ చంపేసి ఉంటాడని, అందుకే పిల్లల్ని సైతం విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయాడని మృతురాలి తండ్రి ఎన్‌.సూర్యప్రకాష్‌ ఆరిలోవ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో తగిన విధంగా కట్నకానుకులు ఇచ్చుకొన్నామ ని, అయినా కట్నం సరిపోక అదనంగా మరిం త కట్నం అడిగేవాడని ఫిర్యాదులో పేర్కొన్నా రు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానా స్పద కేసుతో పాటు మృతురాలి భర్తపై 498ఏ కేసు నమోదు చేసినట్టు సీ.ఐ తిరుపతిరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios