Asianet News TeluguAsianet News Telugu

కాకినాడలో విషాదం.. పెళ్లి బస్సు బోల్తా, ఒకరు మృతి, 36మందికి గాయాలు...

కాకినాడలో విషాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పెళ్లి కొడుకు సహా 36మంది గాయపడ్డారు. 
 

marriage bus accident one dead in kakinada
Author
Hyderabad, First Published May 20, 2022, 11:39 AM IST

కాకినాడ :  kakinada జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సమీపంలో జాతీయ రహదారిమీద Wedding bus బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పెళ్లి కొడుకు సహా 36మంది గాయపడ్డారు. బస్సు విజయనగరం నుంచి ఏలూరుకు వరుడితో మార్గమధ్యలో గండేపల్లి నీలాద్రిరావు పేట పెట్రోల్ బంక్ సమీపంలో accident జరిగింది. ఒకరిపై ఒకరు పడడంతో పెళ్లి కొడుక్కి వరుసకు పెదనాన్న అయిన గుడిపాటి వెంకట కోదండ రామయ్య అనే వ్యక్తి ఊపిరి ఆడకపోవడంతో బస్సులోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉండగా, మే 15న బీహార్ లో ఇలాంటి ఘటనే జరిగింది. బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. నవీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కావాల్సిన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. 

జార్ఖండ్‌లోని ఛతర్‌పూర్‌లోని సోనూతండ్ ఖతిన్ గ్రామానికి చెందిన లార్డ్ సాహు కుమారుడు ప్రకాష్ కుమార్ పెళ్లి వేడుక శనివారం రాత్రి ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ బ్లాక్‌లోని తోల్ పంచాయతీలో జరిగింది. ఈ పెళ్లి ఊరేగింపులో పాల్గొన వరుడి తరఫువారు ఏడుగురు.. వేడుకలు ముగించుకుని ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కారులో పాలము జిల్లాకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు బాఘి గ్రామ సమీపంలో ఉన్న నది వంతెన సమీపంలోకి రాగానే.. అది అదుపు తప్పి రైలింగ్ ఢీకొని వంతెనపై నుంచి కిందకు పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

మృతులను జార్ఖండ్‌లోని పాలము జిల్లా నివాసితులైన రంజిత్ కుమార్, అభయ్ కుమార్, అక్షయ్ కుమార్, శుభం కుమార్, బబ్లు కుమార్‌గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జౌరంగాబాద్‌కు తరలించారు. మరోవైపు గాయపడినవారిని గంజన్ కుమార్, ముఖేష్ కుమార్‌లుగా గుర్తించారు. వారికి మెరుగైన వైద్యం నిమిత్తం వారణాసికి రిఫర్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios