మార్గాని భరత్‌రామ్: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం
Margani Bharat Biography: తొలుత సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సినిమాల కంటే రాజకీయాలే ఉత్తమమని భావించిన ఆయనవైసీపీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. తొలి ప్రయత్నంలోని భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచి పార్లమెంట్ అడుగుపెట్టారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసీపీ యంగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్. తొలుత రాజమహేంద్రవరం ఎంపీ గెలుపొందిన ఆయన రానున్న 2024 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా వైసీపీ తరుపున బరిలో నిలిచారు. ఈ నేపథ్యం మార్గాని భరత్ రామ్ వ్యక్తిగత, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం
Margani Bharat Biography: తొలుత సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సినిమాల కంటే రాజకీయాలే ఉత్తమమని భావించిన ఆయనవైసీపీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. తొలి ప్రయత్నంలోని భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచి పార్లమెంట్ అడుగుపెట్టారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసీపీ యంగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్. తొలుత రాజమహేంద్రవరం ఎంపీ గెలుపొందిన ఆయన రానున్న 2024 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా వైసీపీ తరుపున బరిలో నిలిచారు. ఈ నేపథ్యం మార్గాని భరత్ రామ్ వ్యక్తిగత, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం ..
బాల్యం, కుటుంబ నేపథ్యం
మార్గాని భరత్ రామ్ 1982 మే 12న మార్గాని నాగేశ్వరరావు-ప్రసన్న దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జన్మించారు. భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు రాజమండ్రిలో ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన బీసీ కులాల అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆనాటి రాజకీయాల్లోనూ నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక భూమిక పోషించారు.
ప్రజరాజ్యం పార్టీలో ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఈయనకు 2009 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ సీటు ఇవ్వడానికి చిరంజీవి ససేమేరా అన్నారు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సమయంలో బీసీలకు ప్రజారాజ్యం పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదని విమర్శించారు. ఇలా చేదు అనుభవం ఎదురుకావడంతో నాగేశ్వరరావు రాజకీయాలపై ఆసక్తి తగ్గించారు. తన వ్యాపారాలపై ద్రుష్టి సారించారు. కానీ గతేడాది ఎన్నికల్లో తన కుమారుడు భరత్ కు రాజకీయాల్లోకి పంపించారు.
విద్యాభ్యాసం
పదో తరగతి వరకు తిరుపతిలో చదువుకున్నారు. ఆ తరువాత ఇంటర్ రాజమండ్రిలో పూర్తిచేశారు. రాజమండ్రిలోని గోదావరి డిగ్రీ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. ఇలా ఎంబీఏ చేస్తున్న సమయంలో సినిమా, నటన పెరగడంతో అక్కడ యాక్టింగ్ వర్క్ షాప్ లో హాజరయ్యేవారు. తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత రాజమండ్రికి వచ్చిన భరత్ తన తండ్రితో కలిసి వ్యాపారాలను చూసుకునే వారు. కుటుంబం నుంచి చూస్తే 2013 డిసెంబర్ 12న మోనా తో ఆయనకు వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం
సినీ జీవితం
చదువుకుంటున్న సమయంలో సినిమాల్లో నటించాలనే కోరికతో ప్రయత్నాలు ప్రారంభించారు. అందరిలాగానే సినిమా కష్టాలు పడ్డారు. ఈ సమయంలోనే వైజాగ్ లోని సత్యానంద్ గారి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో కొంతకాలం శిక్షణ తీసుకున్నారు. భరత్ నటనలోనే కాదు.. క్రీడాల్లోనూ రాణించేవారు. ఆయన క్రికెట్ తో పాటు బ్యాట్మెంటన్, స్నూకర్స్ ,టేబుల్ టెన్నిస్ కూడా ఆడేవారు భరత్. అలాగే.. ఆయన పలు ఫ్యాషన్ షోలలో, స్టైలిష్ ఈవెంట్ లో కూడా పాల్గొన్నారు. మరోవైపు..ఆయనకు నిర్మాత వంశీకృష్ణ తో పరిచయం ఏర్పడింది ఈ సమయంలో ’ ఓయే నిన్నే’ అనే సినిమాలో నటించాడు భారత్. ఈ సినిమా విడుదలైన అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ భరత్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక రెండో సినిమా చేయాలని సిద్దమవుతున్న వేళ ఆయనకు రాజకీయాల్లో అవకాశం వచ్చింది.
రాజకీయ జీవితం
ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తితో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు మార్గాని భరత్. జగన్ చేపట్టిన పాదయాత్రకు సపోర్టుగా నిలిచారు. ఈ సమయంలో తన తండ్రికి పోటీ చేసేందుకు అవకాశం వస్తుందనుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు భరత్ కు టిక్కెట్ ఇచ్చారు. ఇలా 2019 ఎన్నికల్లో భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటిపై 1,21,634 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఇలా తొలి ప్రయత్నంలోనే గెలుపొంది.. పార్లమెంట్ లో అడుగుపెట్టారు. దీంతో 2019 జూన్ 5న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు.
పదవులు
2019 సెప్టెంబరు 13 నుండి 2020 సెప్టెంబరు 12 వరకు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా, 2019 అక్టోబరు 9 నుండి పేపర్స్ లెయిడ్ ఆన్ టేబుల్ సభ్యుడుగా సేవలందించారు. అలాగే.. 2020 సెప్టెంబరు 13 నుండి ట్రాన్స్‌పోర్ట్ పర్యాటకం, కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా, భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడుగా బాధ్యతులు నిర్వహించారు.
రాజన్న రచ్చబండ
>> తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించి, రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
యువత హరిత పేరుతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతోపాటు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకోని, ఆ మొక్క కింద విద్యార్థి పేరుతో నేమ్ బోర్డును ఉంచి దాని సంరక్షణ బాధ్యతను ఆ విద్యార్థికి అప్పగిస్తున్నారు.
>> సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి స్థాపించిన ట్రస్టు ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న భరత్. కరోనా, లాక్‌డౌన్ సమయంలో కరోనా రోగులకు అవసరమైన అత్యవసర సేవలను అందించడానికి 60మంది వాలంటీర్లతో సూపర్ 60 అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు.
>> "జగనన్న ఆక్సిజన్ రథచక్రాలు - ఆక్సిజన్ ఆన్ వీల్స్" అనే మరో వినూత్న సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి, కరోనా సమయంలో ఆసుపత్రి రోగులతో నిండినప్పుడు కాన్‌సెంట్రేటర్‌లు, సిలిండర్‌లతో కూడిన రెండు ఆక్సిజన్ బస్సులను అందించాడు.
అవార్డులు
>> 2018-2019 భారత్ గౌరవ్ అవార్డు
>> భారత్ యూత్ అవార్డు (కోవిడ్ సమయంలో సేవలు)