అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై మావోయిస్టులు ఓ ప్రైవేట్ బస్సును తగలబెట్టారు. ఈ ఘటన చింతూరు మండలం కొత్తూరు దగ్గర చోటు చేసుకుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై మావోయిస్టులు ఓ ప్రైవేట్ బస్సును తగలబెట్టారు. ఈ ఘటన చింతూరు మండలం కొత్తూరు దగ్గర చోటు చేసుకుంది. బస్సులోని ప్రయాణికులను కిందకు దించిన తర్వాత నిప్పు పెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు స్పల్పంగా గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. దండకారణ్యం బంద్ దృష్ట్యా బస్సుకు నిప్పు పెట్టినట్టుగా మావోయిస్టులు వెల్లడించారు.
ఇక, బస్సు ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తుంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. మావోయిస్టుల దుశ్చర్యతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మావోయిస్టుల దుశ్చర్యతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సరిహద్దులో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.
ఇక, మావోయిస్టులు ఏప్రిల్ 25న దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టు నర్మద క్యాన్సర్ నేత బాధపడుతూ ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇందుకు అధికార యంత్రాంగమే కారణమని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు దండకారణ్యం బంద్‌కు పిలునిచ్చారు.
ఇక, 2018లో హైదరాబాద్‌కు చికిత్స కోసం వెళ్లిన నిర్మల అలియాస్ నర్మదను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చికిత్స పొందుతూ నర్మద..ఏప్రిల్ 9న మరణించారు.
